HomeసినిమాHatah | సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, పోస్టర్ రిలీజ్

Hatah | సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, పోస్టర్ రిలీజ్

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించారు. బ్యానర్ పై ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనుష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్నారు. శివశంకర నాయుడు. వై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి “హతః” అనే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఒక నల్ల పిల్లిని చూపిస్తూ ‘ఈ పిల్లి బతికి ఉందా లేక..’ అనే క్యాప్షన్ రాశారు. ఇలాంటి డిఫరెంట్ క్యాప్షన్, టైటిల్ పోస్టర్ తో “హతః” సినిమా ఆసక్తి కలిగిస్తోంది. కొత్త తరహా కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు అనే ఇంప్రెషన్ ఈ టైటిల్ పోస్టర్ తో అందరిలో కలుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

- Advertisement -

నటీనటులు – రెహమాన్, కుష్లు, తనూజ పుట్టుస్వామి, నమ్రిత.ఎంవీ, తదితరులు

టెక్నీషియన్స్
——————

పబ్లిసిటీ డిజైన్ – అనంత్ కంచెర్ల
కాస్ట్యూమ్ డిజైనర్ – మేఘన గుమ్మడి
ఆర్ట్ డైరెక్టర్ – మక్కెన విజయ్ కుమార్, జీమోన్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – జునైద్ ఉల్లా, హైకా స్టూడియోస్
అసోసియేట్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అల్లు బాలకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ – వెంకట్ రాహుల్
ఎడిటర్ – అఖిల్ చక్రవర్తి
మ్యూజిక్ – జేసిన్ జార్జ్
కో ప్రొడ్యూసర్స్ – వినీల సాహిత్య, కుష్లు
బ్యానర్స్ – కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్స్ – కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు. వై
స్క్రిప్ట్, డీవోపీ, డైరెక్షన్ – అనుష్ గోరక్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

- Advertisement -
RELATED ARTICLES

Latest News