- సంఘటన్ సృజన్ అభియాన్‌లో ముక్తకంఠంతో ప్రతిపాదన
- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రతిపాదనకు కార్యకర్తల బలపరిచిన మద్దతు
- బీసీ నాయకత్వంతో జిల్లాలో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరుతుందని నేతల ఆశాభావం
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్‌గౌడ్ పేరుకు గట్టి మద్దతు లభించింది.కడ్తాల్‌లోని ఎస్‌ఎల్‌ఆర్ గార్డెన్‌లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి ఆయిళ్ల శ్రీనివాస్‌గౌడ్ పేరును ముక్తకంఠంతో ప్రతిపాదించగా, పలువురు నాయకులు,కార్యకర్తలు ఆయన పేరును బలపరిచారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి కర్ణాటక ఎమ్మెల్సీ,ఏఐసీసీ కార్యదర్శి,రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పి.వి.మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ.వి.శ్రీనివాస్‌రావు,కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


బీసీ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆయిళ్ల శ్రీనివాస్‌గౌడ్ బీసీ నాయకుడిగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.ఆయనను డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే రాబోయే ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని బీసీ వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.కల్వకుర్తి ప్రాంతం నుంచే కాకుండా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,మహేశ్వరం ఇంచార్జీ దేప భాస్కర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఇంచార్జీ గౌరీ సతీష్ లు కూడా శ్రీనివాస్ గౌడ్ నాయకత్వానికి మద్దతు తెలిపారని తెలుస్తోంది.
బీసీ వర్గాలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు అన్ని సామాజిక వర్గాలను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం అవసరమని నాయకులు అభిప్రాయపడ్డారు.ఆయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌కు జిల్లాలోని వివిధ మండలాల నాయకులు,కార్యకర్తలతో ఉన్న పరిచయాలు పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి అభిప్రాయాల సేకరణ
ఏఐసీసీ సూచనల మేరకు డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా క్షేత్రస్థాయి నాయకులు,కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నామని అబ్జర్వర్ పి.వి. మోహన్ తెలిపారు.పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేస్తూ,ప్రజలకు చేరువైన సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.పార్టీ కోసం నిరంతరం పనిచేసే నాయకత్వం,ప్రజాసేవలో నైతికత, కాంగ్రెస్ సిద్ధాంతాలపై స్పష్టమైన అవగాహన,ఎన్నికలు–సంస్థాగత నిర్మాణంపై సమర్థవంతమైన వ్యూహం కలిగిన నాయకుడిని ఎంపిక చేయడం ముఖ్యమన్నారు.

అందరినీ కలుపుకుని ముందుకు..
రాజ్యాంగ పరిరక్షణ,సామాజిక న్యాయం,సమాన అవకాశాలు,ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ,అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని పి.వి.మోహన్ తెలిపారు.బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేసి,ప్రజలతో నిరంతరం అనుసంధానమై పనిచేసే సంస్థాగత వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమన్నారు.డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో క్షేత్రస్థాయి నాయకులు,కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే, అందరినీ కలుపుకుని పనిచేసే, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకత్వాన్ని పారదర్శక విధానంలో ఎంపిక చేస్తామని తెలిపారు.
భారీగా తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి యాచారం వెంకటేశ్వర్లు గౌడ్,డీసీసీ ప్రధాన కార్యదర్శులు చేగూరి వెంకటేష్,రఘురాములు,డీసీసీ కార్యదర్శి రమణారెడ్డి, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్,పీఏసీఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీపతి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మాడుగుల, తలకొండపల్లి, కడ్తాల్, ఆమనగల్ మండలాల పార్టీ అధ్యక్షులు బట్టు కిషన్‌రెడ్డి,కాసు శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి శంకర్, కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఆమనగల్ టౌన్ అధ్యక్షుడు అవ్వారి శివలింగం,సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి దశరథం, కడ్త…
