Homeఆదాబ్ ప్రత్యేకంIrregularities | ప్రభుత్వ భూమిపై కన్వేయెన్స్ లీలలు

Irregularities | ప్రభుత్వ భూమిపై కన్వేయెన్స్ లీలలు

క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ఫైళ్ల క్లియరెన్స్

  • సర్వే నం.30.. ప్లాట్ నం.5పై భారీ అవకతవకలు..
  • జీఓ ఎంఎస్ నం.118 నిబంధనలకు తూట్లు?
  • ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ లేకుండానే నివేదికలు ఇచ్చారా..?
  • ఒకే కుటుంబానికి ఏకంగా 7 కన్వేయన్స్ డీడ్లు..
  • ఫోన్ నంబర్లు, జియోట్యాగింగ్ ఆధారంగానే నివేదికా?
  • సమగ్ర విచారణకు ప్రజా సంఘాల డిమాండ్..

రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండలం మన్సూరాబాద్ పరిధిలోని వివేకానందనగర్ సర్వే నంబర్ 30, ప్లాట్ నంబర్ 5 వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జిఓ ఎంఎస్ నంబర్ 118 నిబంధనలను తుంగలో తొక్కి, ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ (ఫీల్డ్ ఇన్‌స్పెక్సన్) చేపట్టకుండానే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల పేరిట ఏకంగా ఏడు కన్వేయెన్స్ డీడ్‌లు జారీ చేయడం వెనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ బాగోతంపై ‘ఆదాబ్ హైదరాబాద’ ప్రతినిధి నిలదీయగా, అప్పట్లో నోడల్ అధికారిగా వ్యవహరించి ప్రస్తుతం డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్‌గా (డిపిఓ) ఉన్న మల్లారెడ్డి మరియు అప్పటి సరూర్నగర్ తహసిల్దార్ ఎం. జయశ్రీ స్పందించిన తీరు అనేక సందేహాలకు తావిస్తోంది.

- Advertisement -

లబ్ధిదారులు సమర్పించిన ఫోన్ నంబర్లు, జియో ట్యాగింగ్ ఆధారంగానే నివేదిక ఇచ్చామని, క్షేత్రస్థాయిలో ఎవరు ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నా రనే విషయం తమకు పూర్తిగా అవగతం కాదని డిపిఓ మల్లారెడ్డి పేర్కొనడం విస్మయం కలిగి స్తోంది. బాధ్యతాయుతమైన నోడల్ స్థానంలో ఉండి, ఎలాంటి భౌతిక పరిశీలన చేయకుండా కేవలం ఆన్‌లైన్ డేటా ఆధారంగా ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేలా సిఫారసు చేయడం అధికారిక దుర్వినియోగానికి నిదర్శనంగా మారు తోంది.

ఇక అప్పటి తహసిల్దార్ జయశ్రీ మాత్రం కేవలం నోడల్ అధికారి మల్లారెడ్డి ఇచ్చిన నివేదిక ప్రకారమే తాను కన్వేయెన్స్ డీడ్‌లు జారీ చేశానని చెప్పడం ద్వారా బాధ్యతను వేరేవారిపైకి నెట్టే ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిం చాల్సిన రెవెన్యూ యంత్రాంగమే పరస్పర పొంతన లేని సమాధా నాలు ఇస్తుండటం ఈ కుంభకోణంలో వారి పాత్రను స్పష్టం చేస్తోంది.

డూప్లికేట్ ఎంట్రీల మాయాజాలం : రికార్డుల్లో 4315/2023 నంబర్‌కు సంబంధించి డూప్లికేట్ ఎంట్రీ ఉన్నట్లు స్పష్టమవుతున్నా, దాన్ని సరిచూడకుండానే ఫైళ్లు క్లియర్ చేయడం వెనుక పెద్ద మతలబు ఉన్నట్లు తెలుస్తోంది. 1978 నాటి సేల్ డీడ్ లీలలు : ప్రభుత్వ భూమి అయినప్పటికీ, 1978 నాటి ప్రైవేట్ సేల్ డీడ్ నం. 791 (పీసీర్ధం 32 గుంటలు)ను ప్రాతిపదికగా చూపడం పూర్తి నిబంధనల విరుద్ధం. అసలు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఎలా క్రమబద్ధీకరించుకుంటారనేది ప్రశ్నార్థకం.

కలెక్టర్ అనుమతి లేకుండానే విభజన..? : ఒకే ప్రభుత్వాధీనంలోని భూమిని పలు భాగాలుగా విడగొట్టి, ఒకే కుటుంబానికి చెందిన వేర్వేరు వ్యక్తుల పేరిట డీడ్లు మార్చాలంటే జిల్లా కలెక్టర్ ప్రత్యేక అనుమతి తప్పనిసరి. నిబంధనలకు విరుద్ధంగా ఈ తంతు ఎలా నడిచింది?
ఆక్యుపేషన్ పరిమితి ఉల్లంఘన : జిఓ 118 ప్రకారం ఆక్యుపేషన్ గరిష్టంగా 1,000 చదరపు గజాల పరిమితి ఉండాలి. అంతేకాకుండా 2014కు ముందే నిర్మాణం ఉండి, మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్, విద్యుత్ రికార్డులు ఉండాలి. ఇవేవీ లేకపోయినా నివేదికలు ఎలా ఇచ్చారనేది తేలాల్సి ఉంది.

సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తూ, నిబంధనలను గాలికి వదిలి ఒకే కుటుంబానికి లబ్ధి చేకూర్చిన ఈ భారీ అవకతవకలపై ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని స్థాని కులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పటి నోడల్ అధి కారి మల్లారెడ్డి, తహసిల్దార్ జయ శ్రీతో పాటు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రి యలో భాగమైన ప్రతి ఒక్కరిపై సమగ్ర న్యాయ విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సరూర్‌నగర్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా జారీ అయిన మరిన్ని కన్వేయెన్స్ డీడ్‌ల బాగోతాన్ని త్వరలోనే పూర్తి వివరాలతో ‘ఆదాబ్ హైదరాబాద’ మరో ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి తెనుంది.?

‘ఆదాబ్ హైదరాబాద’ “మా అక్షరం అవినీతి పై అస్త్రం”

- Advertisement -
RELATED ARTICLES

Latest News