Homeనిజామాబాద్‌Krishnajiwadi | కృష్ణాజివాడిలో ఓటర్ హియరింగ్.

Krishnajiwadi | కృష్ణాజివాడిలో ఓటర్ హియరింగ్.

తాడ్వాయి మండలంలోని కృష్ణజి వాడి గ్రామంలో శుక్రవారం ఓటర్ హియరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతీ భవనం లో ఏర్పాటు చేసిన ఓటర్ హియరింగ్ కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన లభించింది. తాసిల్దార్ శ్వేత అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేసి ఓటర్స్ నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఓటర్లు తమ ఓటురు కార్డులో సవరణ చేయించుకోవడం కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. కేంద్ర ప్రభుత్వం సర్ ప్రోగ్రాం లో భాగంగా ఓటర్ లిస్ట్లో ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే . ఓటర్లు తెచ్చిన ఆధారాలు ఆధారంగా వాళ్ల ఓటర్ కార్డులో తప్పులు సవరించి ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లు తాసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ హారిక జిపిఓలు, స్వప్న, నారాయణ, ఇతర గ్రామాల జిపిఓలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News