- 13 మంది అరెస్ట్..రూ.15,140 నగదు,11 సెల్ఫోన్లు,రెండు వాహనాలు స్వాధీనం
- కడ్తాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి దేవాలయం సమీపంలోని ఓ హాల్లో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం సాయంత్రం సమయంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి సిబ్బందితో కలిసి హాలుపై దాడి నిర్వహించారు.
ఈ దాడిలో మైసిగండి గ్రామానికి చెందిన 13 మంది వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.వారి వద్ద నుంచి రూ.15,140 నగదు, 11 సెల్ఫోన్లు,రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం పంచనామా నిర్వహించి,నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పేకాట,జూదంపై ఉక్కుపాదం..
ప్రభుత్వ అనుమతి లేకుండా పేకాట,జూదం ఆడినా,నిర్వహించినా కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి హెచ్చరించారు.చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
