- ఎండోస్కోపీతో చాకచక్యంగా తొలగించిన వైద్యులు నవీన్ ఆడేపు.
- ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రూపాయి నాణెం మింగిన ఘటన చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లా అంతర్గ మండలం కేంద్రానికి చెందిన వరుణ్ అనే పది సంవత్సరాల బాబు మూడు రోజుల క్రితం ఆడుకుంటూ ఐదు రూపాయల కాయిన్ మింగడం జరిగిందనీ తెలిపారు.మూడు రోజులు గడిచినప్పటికీ కాయిన్ బయటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాలలోని కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ డాక్టర్ నవీన్ అడపు గారిని సంప్రదించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్ నవీన్ వైద్యు పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల్లో రూపాయి నాణెం ఆహార నాళంలో ఇరుక్కున్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా చాకచక్యంగా నాణెాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పిల్లలు చిన్న వస్తువులను నోట్లో పెట్టుకోకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
