Homeనిజామాబాద్‌Farmers Protest | తాడ్వాయిలో యూరియా కోసం రోడ్ ఎక్కిన రైతలు ..

Farmers Protest | తాడ్వాయిలో యూరియా కోసం రోడ్ ఎక్కిన రైతలు ..

  • రోడ్డుపై రాస్తారోకో, అధికారుల తీరుపై ఆగ్రహం..
  • సరిపడ యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్.

తమకు యూరియా, ఆన్లైన్లో బుక్ కావడం లేదని, నో స్టాక్ చూపిస్తుందని, సరిపడా యూరియా అధికారులు తెప్పించడం లేదని గురువారం తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. గురువారం 440 బస్తాలు తాడ్వాయి పిఎసియస్ పరిధిలో అందుబాటులో ఉందని కావాల్సిన రైతులు బుక్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలుపగా యూరియా దొరుకుతుందని ఆశతో అక్కడికి వెళ్లిన రైతులకు యాప్ ఓపెన్ చేయగానే నో స్టాక్ అని రావడంతో ఆగ్రహించిన రైతులు ఏవో నర్సిములు తో వాగ్వాదానికి దిగారు.

కనీసం ఒక్క నిమిషం కూడా ఆన్లైన్లో స్టాక్ చూయించలేదని తమకు యూరియా తెప్పించాలని ఇలా యూరియా పేరుతో రైతుల ను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు యూరియా కావాలని రైతులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న తాడ్వాయి ఎస్సై నరేష్ సిబ్బందితో ఘటన స్థలానికి వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఈవో నర్సింలు తో మాట్లాడిన ఎస్సై ఒకటి రెండు రోజుల్లో మళ్లీ యూరియా స్టాక్ తెప్పిస్తా అని హామీ ఇవ్వడంతో రైతులు వెనక్కి తగ్గారు.

- Advertisement -
Tadwai farmers protest over urea shortage2

సొసైటీ వాళ్ళు డీడీలు కట్టడం లేదు.. తాడ్వాయి ఏవో నర్సింలు.

గోదాములలో యూరియా స్టాకు సరిపడ ఉందని కానీ సరియైన సమయంలో సొసైటీ వాళ్ళు డీడీలు కట్టకపోవడంతో యూరియా రావడం లేదన్నారు. తాను కరెక్టు టైం లో ఇండెంట్ ఇచ్చినప్పటికి సింగిల్ విండో సొసైటీ సరైన టైంలో డబ్బులు కట్టకపోవడం వల్ల యూరియా సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఇకపై అలా కలవకుండా సొసైటీ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని వివరణ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News