Homeవరంగల్‌Inspection | పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏఎస్పీ….

Inspection | పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏఎస్పీ….

వెంకటాపురం పోలీస్ స్టేషన్ను మంగళవారం ఏటూరునాగారం ఏఎస్పి మనన్ భట్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, క్రైమ్ ఫైల్స్, పోలీస్ స్టేషన్ పరిసరాలు మరియు ఆయుధాల పనితీరు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు రవాణాపై ప్రత్యేక దృష్టి సాధించాలని స్థానిక పోలీస్ అధికారులకు సూచించారు. అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్స్, సి సి టి ఎస్ ఎస్, రోడ్డు ప్రమాదాల పోర్టల్, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ గురించి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నూగూరు వెంకటాపురం సిఐ ముత్యం రమేష్, ఎస్సై లు తిరుపతి రావు, తిరుపతి రెడ్డి, సాయి కృష్ణ లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News