Homeస్పోర్ట్స్India Colombo Test | కొలంబో టెస్టుకు వర్షం దెబ్బ..

India Colombo Test | కొలంబో టెస్టుకు వర్షం దెబ్బ..

  • 95 రన్స్ తో నాటౌట్ గా ధృవ్ జుర్ల్..
  • టెస్ట్ డిక్లేర్ చేసే అవకాశం..

కొలంబో టెస్టుకు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. టీ బ్రేక్‌కు ముందే ఆకాశంలో మబ్బులు క‌మ్ముకోగా.. కాసేప‌టికే వాన అందుకుంది. దాంతో అంపైర్లు ఆట‌ను నిలిపివేశారు. శ్రీ‌లంక బౌల‌ర్ల‌ను ఎడాపెడా ఉతికేస్తున్న రిష‌భ్ పంత్(63) ఔటైనా.. ధ్రువ్ జురెల్‌(95 నాటౌట్) శ‌త‌కానికి చేరువ‌య్యాడు. ఇప్ప‌టికే భారీ స్కోర్ కొట్టిన టీమిండియా జురెల్ సెంచ‌రీ అనంత‌రం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవ‌కాశ‌ముంది.

భార‌త ఆట‌గాళ్ల జోరుకు వ‌రుణుడు అడ్డుప‌డ్డాడు. కాసేప‌ట్లో టీ బ్రేక్ అనగా స్టేడియంలో మేఘాలు క‌మ్ముకున్నాయి. దాంతో, అంపైర్లు ముందుగానే టీ బ్రేక్ ప్ర‌క‌టించారు. ఊహించిన్న‌ట్టే వాన అందుకోవ‌డంతో.. టీమిండియా ఇన్నింగ్స్ కాస్త ఆల‌స్యంగా మొద‌ల‌వ్వ‌నుంది. ఆట నిలిచే స‌రికి భార‌త్ స్కోర్.. 475/8. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 300/5తో రెండో రోజు ఆట ఆరంభించిన భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది.

- Advertisement -

అరంగేట్రం చేసిన‌ స‌రాన్ష్ జైన్(6) నిరాశ‌ప‌రిచాడు. తొలి రోజు రిటైర్డ్ హ‌ర్ట్ అయిన రిష‌భ్‌ పంత్(63) రెండో రోజు తొలి సెష‌న్‌లోనే స‌రాన్ష్ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చాడు. ధ్రువ్ జురెల్‌(95 నాటౌట్)తో కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన పంత్… ఈ క్ర‌మంలోనే ధోనీ ఆల్‌టైమ్ రికార్డును త‌న సొంతం చేసుకున్నాడు. అంతేకాదు టెస్టుల్లో 21వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడీ హిట్ట‌ర్.

- Advertisement -
RELATED ARTICLES

Latest News