Homeరంగారెడ్డిProject Udvasana | పాత దేవతా విగ్రహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు

Project Udvasana | పాత దేవతా విగ్రహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు

  • పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమం..
  • గుండ్లపోచంపల్లి డివిజన్ లో ‘ప్రాజెక్ట్ ఉద్వాసన..
  • పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ సూదంష్..

పాత దేవతా విగ్రహాలు, చిత్రపటాలను నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో, కాలువలు, చెరువుల్లో పడవేయకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి అప్పగించాలని మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సూదంష్ సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాతవి, దెబ్బతిన్నవి, వినియోగానికి అనర్హంగా మారిన దేవతా విగ్రహాలు, చిత్రపటాలను చెత్తకుప్పల్లో లేదా చెరువుల్లో పడవేయకుండా గౌరవప్రదంగా సేకరించి పర్యావరణహిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడమే ప్రధాన ఉద్దేశంతో జిహెచ్ఎంసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

శనివారం మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సూదంష్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ పాత దేవతా విగ్రహాలు, చిత్రపటాలను నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో, కాలువలు, చెరువుల్లో పడవేయకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి అప్పగించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల మనోభావాలు, సంప్రదాయాలకు గౌరవం కల్పించడమే ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ లక్ష్యమన్నారు.

- Advertisement -

నీటి వనరుల్లో విగ్రహాలు, ఇతర పూజా సామగ్రిని వేయడం వల్ల కాలుష్యం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై పాత దేవతా విగ్రహాలు, చిత్రపటాలను ప్రత్యేకంగా సేకరించే వ్యవస్థకు అందించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ను మరింత విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ విజయలక్ష్మి, శానిటేషన్ అధికారి భాస్కర్, నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాయిపేట శ్రీనివాస్, ఉదయ్ గౌడ్, సిబ్బంది ప్రభాకర్, కిరణ్, శివ, భాను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News