Homeభక్తిVaralakshmi Vratam | కోరిన వరాలను ఇచ్చే వరలక్ష్మి..

Varalakshmi Vratam | కోరిన వరాలను ఇచ్చే వరలక్ష్మి..

  • మహిళలందరూ ఆచరించే వ్రతం..
  • నియమ నిష్టలతో చేసుకునే పూజ..

శుభ శ్రావణ మాసంలో కోరిన వరాలు కురిపించే వరలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఆచరించే వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలందరూ ఆచరిస్తారు. వ్రతం అంటేనే నియమం, దీక్ష అని అర్ధం. సంకల్ప సిద్ధి కోసం ఆచరించే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పుడే వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుందని శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో అసలు వరలక్ష్మీ వ్రతాన్ని నియమబద్ధంగా ఎలా జరుపుకోవాలి? వ్రతవిధానం ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

శుభ శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరించే వరలక్ష్మీ వ్రతం లక్ష్మీ నారాయణులకు ఇద్దరికీ ప్రీతికరం. కుటుంబ శ్రేయస్సు కోసం, సకల శుభాల కోసం రోజంతా ఉపవాసం ఉంటూ, మోము మీద చెరగని చిరునవ్వుతో, అమ్మ వరలక్ష్మీదేవిపై చెదరని ధ్యానంతో, పేరంటానికి ఇంటికి వచ్చిన ముత్తైదువులను సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాయనం ఇచ్చి తాంబూల దానం చేసే అపురూపమైన సందర్భమే వరలక్ష్మీ వ్రతం. ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చూద్దాం.

- Advertisement -

ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21 లేదా ఆగస్టు 28, ఈ రెండు రోజుల్లో వారి వారి కుటుంబ సంప్రదాయానికి అనుగుణంగా ఆచరించుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. వ్రతం ఆచరించుకునే వారు ఆ రోజు సూర్యోదయం తోనే నిద్రలేచి తలారా స్నానం చేసి, ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు పంచరంగులతో రంగవల్లికలు తీర్చి దిద్దుకోవాలి. ఇంటి గుమ్మాన్ని మామిడి ఆకులు, పూల తోరణాలతో అలంకరించుకోవాలి. పూజకు అవసరమైన సామాగ్రి అంతా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు కూర్చునే ముందే అమ్మవారి మహా నైవేద్యం కూడా సిద్ధం చేసుకోవాలి. అన్ని సిద్ధం అయ్యాక వ్రతం మొదలు పెట్టాలి. ఒకసారి పూజకు కూర్చున్నాక మధ్యలో లేవకూడదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News