Homeనిజామాబాద్‌పిఎసియసి ల విషయంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.

పిఎసియసి ల విషయంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.

  • కోర్టు మొట్టికాయలు వేసిన ప్రభుత్వనికి బుద్ధి రావడం లేదు.
  • రాజకీయ నిరుద్యోగుల కోసం నామినేటెడ్ పోస్ట్ లా..?
  • నామినేటెడ్ పోస్టులతో సింగిల్ విండో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది..?
  • దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహించాలి.
  • తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి ఘాటు విమర్శలు.

ప్రభుత్వం పిఎసియస్ ల విషయంలో ఒంటెద్దు పోకడలను మానుకోవాలని, ప్రజాసమ్య బద్ధకంగా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని, తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డిసిసిబి మాజీ డైరెక్టర్ నల్లవెల్లి కపిల్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం తాడ్వాయి మండల కేంద్రంలోని పిఎస్ సియస్ కార్యాలయంలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పిఎసియస్ విషయంలో ప్రభుత్వానికి కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన బుద్ధి రావడం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నిర్వహించి పాలకవర్గాని ఎన్నుకోకుండా తమ రాజకీయ నిరుద్యోగుల కోసం నామినేట్ పదవులు కేటాయిస్తుందన్నాని విమర్శించారు.

పిఎస్ సియస్ విషయంలో రైతులే న్యాయ నిర్ణయేతలని వారికి ఎవరు కావాలో తమ ఓటు ద్వారా ఎన్నుకునే హక్కు వాళ్లకు ఉందని,వాళ్ళ హక్కులను కాలరాసి, దొంగ దారిన, ఒంటెద్దు పోకడతో నామినేటెడ్ కార్యవర్గాన్ని నియమించడం ముమ్మాటికి, ప్రజా విరుద్ధం పనేనన్నారు. గతంలో తనను సింగిల్ విండో పదవి నుండి తప్పించి ప్రత్యేక అధికారిని నియమించరాని, ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయించగా, మళ్లీ కోర్టు మొట్టికాయ వేసి తనకి పదవి బాధ్యతలు ఇచ్చిందని ఇదే విషయన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.

- Advertisement -

మే నెల వరకు ప్రత్యేక అధికారి పాలనలో లక్ష రూపాయలు ఉన్న సొసైటీ లాభం, తను మళ్ళీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఈ ఐదు నెలల్లో సొసైటీ లాభాన్ని 9 లక్షలకు పెంచామని, తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించక ముందు,రెండు కోట్లు ఉన్న రైతు రుణాలు, ప్రస్తుతం 8.5 కోట్లకు పెంచామని, రెండు కొనుగోలు కేంద్రాలను నుండి 14 కొనుగోలు కేంద్రాలకు పెంచామని , రెండు యూరియా సెంటర్లను ఐదుకు పెంచామని, మూడు కోట్ల రుణాలు రికవరీ చేసామని తన పాలకవర్గ అభివృద్ధికి ఇవే సాక్షాలన్నారు.

ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులతో పిఎసిఎస్ లను నిర్వీర్ణం చేయాలని చూస్తుందన్నారు. రైతులు యూరియా యాప్ ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే యూరియా యాప్ ను తొలగించి పాత పద్ధతి ద్వారా యూరియా సరఫరా చేయాలన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, పూర్తిస్థాయిలో రైతుబంధు ఇవ్వడంలేదని, రైతు బీమా ముగిసిన భీమా చెల్లించలేదని, ఆయన ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఇకనైనా ప్రభుత్వం మొండితనాన్ని విడనాడి ప్రజాసామ్య బద్దంగా పిఎసియసి ఎన్నికల నిర్వహించి రైతులకు మేలు చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News