Homeరంగారెడ్డిPasumamula | మంచినీటి సమస్యను పరిష్కరించాలని కమీషనర్ కు వినతి

Pasumamula | మంచినీటి సమస్యను పరిష్కరించాలని కమీషనర్ కు వినతి

  • గత 15 రోజులుగా పైపులైన్ పగిలి నీరు వృధాగా పోతున్నా పట్టించుకోని అధికారులు

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పెద్దఅంబర్ పేట డివిజన్ లోని పసుమాముల వివేకానందనగర్ కాలనీలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు బుధవారం కమీషన ర్ సంపత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రధాన రోడ్డు పై కాలనీకి వచ్చే పైపులైన్ పగిలి గత 15 రోజులు గడుస్తున్నా వాటర్ వర్క్స్ అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యను వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు గూడెపు రాజు గౌడ్, లక్ష్మణ్, రవీందర్, నర్సింహా, చాంద్ పాషా తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News