Homeనల్లగొండGunjaluru | గుంజలూరు గ్రామ అభివృద్ధికి పునాది…

Gunjaluru | గుంజలూరు గ్రామ అభివృద్ధికి పునాది…

  • సర్పంచ్ బొల్లికొండ సైదులు
  • రూ. 20లక్షలతో మంజూరైన నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన…

గుంజలూరు నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామ అభివృద్ధికి పునాది పడిందని గ్రామ సర్పంచ్ బొల్లికొండ సైదులు అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 20లక్షలతో మంజూరైనా నూతన గ్రామ పంచాయతీ భవనానికి బుధవారం శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ దృష్టికి తనతో పాటు తమ పాలకవర్గం నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ మంజూరు చేయాలని కోరడంతో నూతనంగా భవనం మంజూరు చేసినట్లు అయన తెలిపారు. నూతనంగా నిర్మించే భవనం ప్రజలకు అన్ని రకాల సేవలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మించనున్నట్లు తెలిపారు.

స్థల దాత పెదపోలు పుల్లయ్య గౌడ్ కు తనతో పాటు తమ పాలకవర్గం, గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. . ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రాహుల్ . ఉపసర్పంచ్ దొనకొండ పావనిమహేష్. గ్రామ కార్యదర్శి నారాయణ. పాలక వర్గ సభ్యులు కొప్పు సైదులు. పెదపోలు చందన, మొలుగూరి శ్రావణి. స్థలధాత పెదపోలు పుల్లయ్య గౌడ్. కిసాన్ సెల్ అధ్యక్షుడు సుంకరి ఉపేందర్. వలిశెట్టి ఆంజనేయులు, ఎక్కటి శ్యామ్ రెడ్డి, బొజ్జ పాపి రెడ్డి, సిలివేరు రమేష్, బొల్లికొండ శరత్, నాగార్జున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News