Homeనల్లగొండUndrugonda | ఉండ్రుగొండ గ్రామ అభివృద్ధికి పునాది…

Undrugonda | ఉండ్రుగొండ గ్రామ అభివృద్ధికి పునాది…

  • సర్పంచ్ గుడిసె రామకృష్ణ
  • రూ. 10లక్షలతో మంజూరైన నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన…

ఉండ్రుగొండ నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామ అభివృద్ధికి పునాది పడిందని గ్రామ సర్పంచ్ గుడిసె రామకృష్ణ అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 20లక్షలతో మంజూరైనా నూతన గ్రామ పంచాయతీ భవనానికి బుధవారం శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ నూతన భవనం మంజూరు చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నిర్మించే భవనం ప్రజలకు అన్ని రకాల సేవలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మించనున్నట్లు తెలిపారు. గ్రామ ఉపసర్పంచ్ పల్లెటి వీరమ్మ, వార్డు సభ్యులు పల్లెటి జనార్దన్, గుడిసె లింగయ్య, దాసరి లింగయ్య, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు మామిడి యల్లయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News