Homeమహబూబ్‌నగర్‌Papanna Goud | రావిచేడ్ గడ్డపై పాపన్న పౌరుషం.. ఘనంగా విగ్రహావిష్కరణ

Papanna Goud | రావిచేడ్ గడ్డపై పాపన్న పౌరుషం.. ఘనంగా విగ్రహావిష్కరణ

  • బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న గౌడ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
  • సబ్బండ వర్గాల ఐక్యతతోనే సామాజిక అభ్యున్నతి..
  • టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌

బహుజన చక్రవర్తి,వీర యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 376వ జయంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలంలోని రావిచేడ్ గ్రామంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామ ప్రజలు,గౌడ సంఘం నాయకులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పాపన్న గౌడ్‌కు ఘనంగా నివాళులర్పించారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.కార్యక్రమానికి గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌, జేఏసీ చైర్మన్‌ సదానందం గౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.పాపన్న చరిత్ర నేటి తరానికి స్ఫూర్తిదాయకం ఈ సందర్భంగా ఆయిళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప ప్రజా నాయకుడని అన్నారు.బడుగు,బలహీన,దళిత,బహుజన వర్గాలను ఏకం చేసి వారి ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన పాపన్న గౌడ్‌ చరిత్ర నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

- Advertisement -

డిల్లీ పాలకుల గుండెల్లో సింహస్వప్నం

ఆ కాలంలో అధికార వర్గాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పాపన్న గౌడ్‌ ధైర్యంగా పోరాడారని తెలిపారు.సామాన్య ప్రజలను సమీకరించి తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని,అనేక కోటలను నిర్మిస్తూ తన పోరాటాన్ని విస్తరించారని చెప్పారు.ఢిల్లీ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన పాపన్న గౌడ్‌ వీరత్వం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.పాపన్న ఆశయాలతో ముందుకు సాగాలి’

పాపన్న గౌడ్‌ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని,సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజా యోధుడని ఆయిళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేయడంతో పాటు,సబ్బండ వర్గాలను కలుపుకుని సామాజిక ఐక్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

పాపన్న గౌడ్ ధైర్య సాహసాలు యువత నేర్చుకోవాలి

యువత పాపన్న గౌడ్‌ చరిత్రను తెలుసుకుని ఆయనలోని ధైర్యం,నాయకత్వ లక్షణాలు,ప్రజా సంక్షేమ భావనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.రావిచెడు గ్రామంలో పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని,ఈ విగ్రహం భవిష్యత్‌ తరాలకు ఆయన చరిత్రను,పోరాట స్ఫూర్తిని గుర్తుచేస్తూ నిలిచే చిహ్నంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బొప్పిడి గోపాల్‌,ఉపసర్పంచ్‌ యాదయ్య,గౌడ సంఘం అధ్యక్షులు జనార్ధన్‌ గౌడ్,ఉపాధ్యక్షులు రమేష్‌ గౌడ్‌,రామచంద్ర గౌడ్‌,అంజయ్య గౌడ్‌,సత్తయ్య గౌడ్‌,పాండు గౌడ్‌,గౌడ యువ నాయకులు రమేష్‌ గౌడ్‌,నరసింహ గౌడ్‌,ఉపేందర్‌ గౌడ్‌,నరేష్‌ గౌడ్‌,భాస్కర్‌ గౌడ్‌,మహేందర్‌ గౌడ్‌,ఆంజనేయులు గౌడ్‌,వెంకటేష్‌ గౌడ్‌,డాక్టర్‌ శ్రీనివాస్‌,రవి గౌడ్‌,యాదగిరి,పెంటయ్య గౌడ్‌,రాములు గౌడ్‌,మహిపాల్‌రెడ్డి,సంతోష్‌కుమార్‌,రాఘవేందర్‌,రమేష్‌,రామస్వామి,నరసింహ,పాండు,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News