Homeనిజామాబాద్‌Jayanti | ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

Jayanti | ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

  • జై గౌడ జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్.

సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా బీసీ, ఎస్సి,ఎస్టీ, మైనార్టీ,అణగారిన వర్గాల ప్రజలు పనిచేయాలని జై గౌడ ఉద్యమ అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ అన్నారు. ఆయన మంగళవారం తాడ్వాయి మండలంలోని ఎర్రపహడ్ గ్రామంలో బహుజన సభ్యులతో కలిసి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ శతాబ్దపు ప్రారంభంలో తెలంగాణ ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణ, స్థానిక జమీందార్ల పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు, బహుజన విప్లవ యోధుడు.

బహుజన సామ్రాజ్యం నెలకొల్పుడం కోసం ఆనాడు గోల్కొండ కోట కోటను స్వాధీనం చేసుకొని జెండాను ఎగరవేసిన తొలి బహుజన చక్రవర్తి పాపన్న అన్నారు.పాపన్న గౌడ్ సామాజిక, సమానత్వం, కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్, ఉపాధ్యక్షులు కరోల్ల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తూప్రాన్ ప్రకాష్ గౌడ్, కృష్ణ చైతన్య గౌడ్, కార్తిక్ గౌడ్, ముఖేష్ గౌడ్, అంజాగౌడ్, గైన్ రాజలింగం, , అచ్యుతరావు, బద్దం సంజీవరెడ్డి, అనిల్ చారి, జై గౌడ్ నాయకులు, గౌడ సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News