చిన్నప్పుడు తమతో పాటు కలిసి చదువుకున్న మిత్రుడు అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబానికి చిన్న నటి బాల్యమిత్రులు ఆర్థికంగా నిలిచిన సంఘటన తాడ్వాయి మండలంలోని కృష్ణజివాడి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ఆంజనేయులు కొన్ని రోజుల క్రితం మృతి చెందగా, అతని భార్య పిల్లలు, పేదరికంలో ఉండడం చూసి చలించిపోయిన బాల్య మిత్రులందరు చందాలు వేసుకొని 30 వేల రూపాయలు పోగు చేసి ఆదివారం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా బాల్యమిత్రులు చనిపోయిన స్నేహితుడు తమతో కలిసి గడిపిన జ్ఞాపకాలను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. తమ మిత్రుడు అకాల మరణం పొందడం తమకు తీవ్రంగా కశిలివేసిందని తమ వంతు సహాయంగా తమకు తోచింది మిత్రుని కుటుంబానికి ఇవ్వాలనిపించి అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని 30 వేల రూపాయలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు చిన్ననాటి మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు
