Homeబిజినెస్Scorpio-N | కొంపల్లిలో కొత్త స్కార్పియో-ఎన్‌ను ఆవిష్కరణ..

Scorpio-N | కొంపల్లిలో కొత్త స్కార్పియో-ఎన్‌ను ఆవిష్కరణ..

  • లాంచ్ చేసిన ల్యాండ్‌మార్క్ మహీంద్రా
  • కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యం..

ల్యాండ్‌మార్క్ మహీంద్రా సంస్థ హైదరాబాద్‌లోని కొంపల్లి షోరూమ్‌లో కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్‌ను ఘనంగా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, వినియోగదారులు, ఆటోమొబైల్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ల్యాండ్‌మార్క్ గ్రూప్ దక్షిణ భారత విభాగం సీఈఓ మహేంద్రబాబు, సంస్థ సీనియర్ నాయకత్వ బృందం పాల్గొని వినియోగదారులకు స్వాగతం పలికారు. ప్రపంచ స్థాయి వాహనాలు, ఉత్తమ కస్టమర్ సేవలను అందించడంలో ల్యాండ్‌మార్క్ మహీంద్రా కట్టుబడి ఉందని వారు తెలిపారు.

కొత్త స్కార్పియో-ఎన్ ఆవిష్కరణకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రత్యేక ప్రారంభ ఆఫర్లు, టెస్ట్ డ్రైవ్‌లు, వినోదాత్మక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఆధునిక సాంకేతికత, మెరుగైన పనితీరు, సౌకర్యవంతమైన ఫీచర్లతో కొత్త స్కార్పియో-ఎన్ వినియోగదారుల అంచనాలను మించిపోతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు కొత్త మోడల్‌పై ఆసక్తి వ్యక్తం చేస్తూ టెస్ట్ డ్రైవ్‌లలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News