- క్షుద్ర పూజలు భూ వివాదం కోసమా?
- గుప్తనిధుల కోసమా..!
- భయాందోళనలో గ్రామస్తులు.
తాడ్వాయి మండలంలోని పల్లె గడ్డ తండాలో క్షుద్ర పూజల కలకలం లేచింది శనివారం రాత్రి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పల్లె గడ్డ తండాకు ఆనుకొని వున్నా రుక్మాయపల్లి పురాతన గడి వద్ద క్షుద్ర పూజలు చేసినట్టు ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్కడ రెండు గుంతలలో ఆ గుంతల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయ, తో పాటు క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను అక్కడ ఉంచినట్లు గ్రామస్తులు తెలిపారు. రుక్మాయపల్లి గడి వద్దకు అర్ధరాత్రి ట్రాక్టర్లలో కొందరు వచ్చి క్షుద్రపూజలు నిర్వహించినట్లు తాడ్వాయి మండలంలోని పల్లెగడ్డ తండాలో వాసులు ఆరోపణలు తీవ్ర కలకలం రేపింది.
పల్లె గడ్డ తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం పల్లె గడ్డ తండాకు పక్కనే 50 ఏండ్ల క్రితం ఆ గడి ఉన్న ప్రాంతంలో రుక్మయ్యపల్లి అనే గ్రామం ఉండేది. ఆ రోజుల్లో గడి సమీపంలో కొందరు తవ్వకాలు జరపడంతో ఊరికి తీవ్రమైన గత్తర సోకి, ఊరు ఉరే లేకుండా పోయిందని అన్నారు. గతంలో ఒక వ్యక్తి అక్కడ మొరం తవ్వగా, ఆయన ఇంటోని ఆవు పాలు పిండితే రక్తం కారిందిదన్నారు , ఆ గడిలో ఎవరైనా దీపం సైతం వెలిగిస్తే వెలగదని , ఆ గడి లోనికి వెళ్లడానికి ఎవరు కూడా ధైర్యం చేయలేరని, రాత్రి అటు వెళ్లాలంటే ఎవరు ధైర్యం కూడా చేయలేరని తండావాసులు అన్నారు. అప్పటినుంచి ఆ గడి జోలికి ఎవరూ వెళ్లడం లేదని తండావాసులు భయాందోళనతో చెబుతున్నారు.

గుప్త నిధుల కోసం చేశారా..!
భూ వివాదం కోసం చేశారా అన్నది ప్రశ్న అర్థంకం..!
గడి స్థలం పై గత కొన్ని నెలలుగా భూ వివాదం నడుస్తోండగా శనివారం రాత్రి ట్రాక్టర్లలో కొందరు వచ్చి పూజలు చేసి వెళ్లినట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్థ రాత్రి సమయంలోనే ఒకేసారి అంతమంది వచ్చి ఉదయం ఒక్కరు కనిపించకుండా వెళ్లిపోవడం వెనుక పట్ల తండా ప్రజలు పలు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గడి ముందు, రెండు గుంతలు తీసి అందులో క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాలు కనిపిస్తున్నయన్నారు.దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్షుద్ర పూజలు వివాదంలో ఉన్న భూమి కోసమా లేదా గుప్తనిధుల కోసం చేశారా అని అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పల్లె గడ్డ తాండ ప్రజలు ఆదివారం పోలీస్ స్టేషన్కుకు వచ్చి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు ఈ విషయమై విచారణ చేపట్టి ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తండావాసులు డిమాండ్ చేశారు. ఇవి మూఢనమ్మకాల లేదా క్షుద్రపూజల పేరుతో తండాలో తాండా ప్రజల్లో భయా ఆందోళనలతో సృష్టించాలని కోనంలో ఎవరైనా చేసి ఉంటారా అనే విషయం తెలియక తాండావాసులు తీవ్ర భయాందోళన గురవుతున్నారు.
