అరే ఏందీ భయ్ గీ ముచ్చట?
కాలువలల్లో నీళ్లు రాక, కరెంట్ కోతలతో
రైతులు రోడ్డెక్కి ఏడుస్తుంటే… ఈడ ఎవడో పెద్ద
మాయగాడు బోడి గుండు మీద బూడిద
రాసుకొని, బూరెలు నైవేద్యం పెడితే తెలంగాణ
సచ్చిపోతదట! ఏంది సార్ మీ లాజిక్కు?
వానాకాలం వస్తే ఆకాశం కేసి చూడాల్సింది
పోయి, శ్మశానంలో ఎముకలు
వెతుకుతున్నారంటే మీ బుర్ద రాజకీయాలు ఏ
లెవెల్లా ఉన్నయో అర్థమైతనే ఉంది. ప్రజల
కష్టాలు గాలికి వదిలేసి, ఈ చేతబడులు, క్షుద్ర
పూజల కతలు అల్లుడు.. మీ దొంగ డ్రామాలకు
జనం నవ్వుతుండ్రు సార్! ఇవన్నీ పక్కదారి
పట్టించే పచ్చి పొలిటికల్ జిమ్మిక్కులే గానీ,
నిజంగా దయ్యాలు వచ్చి కుర్చీలు
లాక్కుంటయా ఏంది?
- Advertisement -
