- మిడ్ రేంజ్ వినియోగదారులు లక్ష్యం..
- ప్రారంభ ధర రూ. 25,999 గా నిర్ణయం..
శాంసంగ్ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఎఫ్70 సిరీస్‌లో కొత్తగా ఎఫ్70 ప్రో 5జీను మిడ్‌రేంజ్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. శక్తిమంతమైన ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ డిస్ప్లే, గెలాక్సీ ఏఐ ఫీచర్లతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. దీర్ఘకాల సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఇవ్వడం మరో ప్రధాన ఆకర్షణ.
గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ ప్రారంభ ధర రూ.25,999గా నిర్ణయించారు. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. 8జీబీ + 128జీబీ మోడల్ రూ.29,999, 8జీబీ + 256జీబీ వేరియంట్ రూ.34,999కు లభిస్తుంది. ప్రారంభ ఆఫర్లతో ఈ ఫోన్‌ను రూ.23,999 నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆల్ఫా బ్లాక్, ఆరా గ్రీన్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంది. శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్ మరింత సాఫీగా ఉంటుంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రక్షణ కల్పించారు. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 8జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందించారు. వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఇచ్చారు. 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ హెచ్డీఆర్ కెమెరా ఏర్పాటు చేశారు
