తాడ్వాయి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ సభ్యులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుటు ఒకరు ఒకరు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ చైతన్య గౌడ్ మాట్లాడితు వృత్తిపరంగా మేము జర్నలిస్ట్ అయినప్పటికీ మా మధ్య ఎన్నో స్నేహబంధం ఉందని, ప్రతి ఒక్కరం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని, ఆపద సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉంటామన్నారు.

ప్రపంచంలో స్నేహ బంధానికి మించిన బంధం ఏదిలేదని అన్ని బంధాలలో స్నేహ బంధం గొప్పదని ఎలాంటి రక్త సంబంధం లేకుండా మనతో ఎల్లప్పుడూ ఎల్లవేళలా మనకు అండగా వుండేవాడు స్నేహితుడు మాత్రమే అన్నారు.ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు మనకు ఎల్లప్పుడూ పక్కన ఉండి కష్ట సుఖలలో పలు పంచుకునే వాడే స్నేహితుడు మాత్రమే అని అన్నారు.శ్రీ కృష్ణడు, కుచేలుడు, స్నేహం నుండి మొదలుకొని నేటి అధినిక యుగం వరకు స్నేహ బంధం చాలా గొప్పదన్నారు.

ప్రతి ఒక్కరికి జీవితం లో ఒక ప్రాణ స్నేహితుడు ఉంటాడని కుటుంబంతో పంచుకొని విషయాలు కూడా స్నేహితుడితో పంచుకుంటున్నారాన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కృష్ణ చైతన్య గౌడ్,జర్నలిస్ట్లు రాజకుమార్, మల్లేష్, సునీల్, మురళి, సాయిబాబా, చంద్రశేఖర్, అఖిల్,నవీన్, రాజలింగం,ప్రవీణ్, నరేష్, రాజు,తదితరులు పాల్గొన్నారు.
