HomeతెలంగాణSLBC Tunnel | నామీద కోపం ప్రజల మీద చూపించారు..

SLBC Tunnel | నామీద కోపం ప్రజల మీద చూపించారు..

  • కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్..
  • ఎస్ ఎల్ బీ సి ని నిర్లక్ష్యం చేశారు..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై ఉన్న రాజకీయ కక్షతోనే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులను గతంలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆయన ఆరోపించారు. శనివారం నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన మంత్రి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, “2007లోనే అమెరికా నుంచి యంత్రాలు తెప్పించి సొరంగం పనులు ప్రారంభిస్తే, కేవలం నాకు పేరు వస్తుందనే దురుద్దేశంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిలిపివేశారు. అప్పట్లో ఆ పనులను కొనసాగించి ఉంటే రూ.1,000 కోట్లతో రెండేళ్లలోనే పూర్తయ్యేవి. నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేసీఆర్ కనికరించలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. సొరంగం పనులు పూర్తయి ఉంటే, ప్రస్తుత కరవు పరిస్థితుల్లోనూ నల్గొండ ప్రాంతంలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తాము అమెరికాకు వెళ్లి కాంట్రాక్టర్‌కు రూ.300 కోట్లు చెల్లించి పనులను పునరుద్ధరించామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో సొరంగం పనులు పూర్తి చేసి, రెండు పంటలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 2028 జూలై నాటికి ఈ సొరంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News