మల్కాజ్గిరి నియోజకవర్గం, మిర్జాల్గూడ సర్కిల్ పరిధిలోని వాణి నగర్ కాలనీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, గౌతమ్ నగర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మా శెట్టి అనిల్ గుప్తా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పనిచేస్తోందని అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు యువత బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.
పార్టీలో చేరిన మా శెట్టి అనిల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. త్వరలో తన అనుచరులు, స్నేహితులతో కలిసి మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, బైరు అనిల్, హేమంత్ పటేల్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్సింగ్, జక్కుల కిరణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
