- చేగుంటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తా
- మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సూరిఫై పాఠశాల కిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు ఉచిత పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కూడా నేటి కాలంలో ఎంతో ముఖ్యమని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి సూరిఫై సంస్థ అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. చేగుంట ప్రాంత ప్రజల చిరకాల కోరికైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కళాశాల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
