Homeమెదక్‌Jagadevpur | నాకు నచ్చిన చోటే ఉంటా నీకెందుకు?:

Jagadevpur | నాకు నచ్చిన చోటే ఉంటా నీకెందుకు?:

  • సర్పంచ్‌పై పంచాయతీ కార్యదర్శి జులూమ్
  • రెండు గ్రామాలకు ఒకే సెక్రటరీ.. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం
  • ప్రశ్నించిన ప్రజాప్రతినిధిపై దురుసు ప్రవర్తన
  • ఎంపీడీఓకు లిఖితపూర్వక ఫిర్యాదు

“నాకు నచ్చిన చోటే ఉంటా.. నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా! నాతో మీకు పనేంటి? అసలు మీకు, నాకు సంబంధం ఏంటి? నేను మీ గ్రామానికి డిప్యుటేషన్‌పై వచ్చా..అంటూ ఒక పంచాయతీ కార్యదర్శి బాధ్యతారాహిత్యంగా మాట్లాడడమే కాకుండా, గ్రామ సర్పంచ్‌పైనే జులూమ్ ప్రదర్శించిన ఘటన జగదేవపూర్ మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. జగదేవపూర్ మండలంలోని ఒకే పంచాయతీ కార్యదర్శికి రెండు గ్రామాల బాధ్యతలను అదనపు బాధ్యతలు అప్పగించారు.అయితే, ఆ కార్యదర్శి మాత్రం కేవలం ఒకే గ్రామానికి పరిమితమౌతూ, రెండో గ్రామాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో, సదరు గ్రామ సర్పంచ్ అసలు విషయం తెలుసుకోవడానికి ఆ కార్యదర్శికి ఫోన్ చేశారు.

- Advertisement -

సర్పంచ్‌ అని కూడా చూడకుండా..

గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కు కనీస గౌరవం, మర్యాద ఇవ్వకుండా ఆ కార్యదర్శి ఫోన్ లోనే విరుచుకుపడ్డారు. “నన్ను అడగడానికి నువ్వు ఎవరు? నీకేం అధికారం ఉంది? మీ ఇంట్లో నుంచి ఏమైనా నాకు జీతం ఇస్తున్నారా? అంటూ ఇష్టం వచ్చినట్లుగా దురుసుగా మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, ప్రజాప్రతినిధి అని చూడకుండా అంతలా అహంకారం ప్రదర్శించడం స్థానికంగా కలకలం రేపింది.

ఎంపీడీఓకు ఫిర్యాదు..

కార్యదర్శి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్.. వెంటనే ఈ విషయాన్ని జగదేవపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి వేణుగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కార్యదర్శి దురుసుగా మాట్లాడిన ఆడియో రికార్డింగ్ లను సైతం ఎంపిడిఓ కు అందజేశారు. విధులను నిర్లక్ష్యం చేస్తూ, దురంహకారంతో మాట్లాడుతున్న ఇలాంటి పంచాయతీ కార్యదర్శి మా గ్రామానికి వద్దే వద్దంటూ గ్రామస్తులు, సర్పంచ్ తరపున లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సదరు కార్యదర్శి తీరుపై పూర్తి వివరాలు సేకరించి, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ప్రజాప్రతినిధులపై ఇలాంటి జులూమ్ ప్రదర్శిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News