నిబంధనలను తుంగలో తొక్కిన రాక్‌వెల్ స్కూల్
- పాఠశాల అనుమతులపై తీవ్ర వివాదం
- జీఓ-111 నిబంధనల ఉల్లంఘన..
- బిల్డింగ్ పర్మిట్, ఫైర్ ఎనఓసీ లేకుండానే నిర్వహణ
- అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ప్రశ్నలు
- సమగ్ర విచారణ, కఠిన చర్యలకు డిమాండ్
విద్యార్థుల భద్రతను పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సతంరాయి కాలనీలోని రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, ఫైర్ ఎనఓసీ తదితర అంశాల్లో అక్రమాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తూ సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, సతంరాయి కాలనీలోని ‘రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల’ నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నంబర్లు 84, 85, కేఎసఆర్ రోడ్డు వద్ద ఉన్న ఈ పాఠశాల, విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిందని స్థానికులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ అనుమతుల్లో భారీ గోల్‌మాల్..? :
సుమారు 8 ఎకరాల్లో భారీ భవనాలను నిర్మించినా, సంబంధిత అధికారుల నుండి చట్టబద్ధమైన బిల్డింగ్ పర్మిట్లు పొందలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాంతం జీఓ 111 పరిధిలోకి వస్తుంది. ఎలాంటి భవన నిర్మాణాలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆమోదిత బిల్డింగ్ ప్లాన్, స్ట్రక్చరల్ అప్రూవల్ లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే నిర్మాణాలు చేపట్టడం ప్రమాదకరమని స్థానికులు పేర్కొంటున్నారు.
ప్రమాదకరంగా భద్రతా ప్రమాణాలు :
విద్యార్థుల ప్రాణ భద్రతకు కీలకమైన ‘ఫైర్ ఎనఓసీ’ (అగ్నిమాపక శాఖ అనుమతి) లేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వందలాది మంది విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ఆందోళన కలిగిస్తోంది.

అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు :
గత ఫిబ్రవరి 28, 2025న (ప్రొసీడింగ్స్ నంబర్: ఆరఆర్-ఎసఎస్‌బి-024-0791) పాఠశాలకు అనుమతి మంజూరైంది. అయితే, జీఓ ఎంఎస్ నంబర్ 1 (01-01-1994) ప్రకారం, మౌలిక సదు పాయాలు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలిం చాల్సి ఉండగా, వాటిని విస్మరించి అనుమ తులు ఇవ్వడం వెనుక ఉన్న లోతైన విచారణ జరగా లని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యా నికి లేదాఒత్తిడికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు.
తక్షణ చర్యలకు డిమాండ్ :
ఈ అక్రమ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన పాఠశాల యాజమాన్యం పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అన్ని అనుమతులు పొందే వరకు పాఠశాల కార్య కలాపాలను నిలిపివేయాలని, విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడవద్దని వారు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
