- నిర్మల్ పట్టణలో నడిబొడ్డున పట్టపగలు చోరీ చేసి పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
రెండు రోజుల క్రితం తన్వి అపార్ట్మెంట్ లో, నిన్న రాత్రి దిలావర్పూర్ గ్రామం చోరీ ఘటనలు మరువకముందే ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిర్మల్ పట్టణం ఈద్గాం వద్దగల ఎస్.వి అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడ్డారు.
గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి దర్జాగా అపార్ట్మెంట్ లోనికి వచ్చి 101 ఫ్లాట్ తాళం పగలగొట్టి సుమారు 250 గ్రాముల వెండి కొంత నగదును దోచుకున్నారు. అనంతరం 201 ఫ్లాట్ తాళం పగలగొట్టే ప్రయత్నం చేశారు. ప్రయత్నం విఫలం కావడంతో వెన్ను తిరిగారు.
- Advertisement -
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలే పట్టణం నడిబొడ్డున చోరీ జరగడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు…
- Advertisement -
