Homeఆదాబ్ ప్రత్యేకంEarth Leadership | పుస్తక పఠనాన్ని విస్మరిస్తున్న విద్యార్థీ.. మేలుకో!

Earth Leadership | పుస్తక పఠనాన్ని విస్మరిస్తున్న విద్యార్థీ.. మేలుకో!

పంచభూతాలు (గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశ)
నీకు ప్రసాదించిన నాయకత్వ సామర్థ్యాలు

  • ఓ విద్యార్థీ, నీవు పుట్టుకతోనే నాయకుడివని నీకు తెలుసా?
  • భూమాత మీకు అందించిన నాయకత్వ సామర్థ్యాలు, గుణాలను ఎప్పుడైనా గుర్తించారా?
  • నాయకత్వానికి మూలం… స్వయాన్ని చదివే సామర్థ్యం!!
  • “స్వయాన్ని తెలుసుకోండి – నాయకత్వాన్ని వెలికితీయండి”
    ( వ్యాసం మూడవ భాగం భూమి నాయకత్వ శైలి గురించి )

పంచభూతాలు నీకు ప్రసాదించిన నాయకత్వ సామర్థ్యాలు – భూమి నాయకత్వ శైలి..

- Advertisement -

మీలో ఉన్న భూమి తత్వం/స్వభావం నుంచి నాయకత్వ పాఠాలు :
అందరినీ కలుపుకొని ముందుకు నడిపించే సమగ్ర నాయకత్వం :

ప్రకృతిలో భూమి ఒక అద్భుతమైన సృష్టి. అనేక రంగులు, వాసనలు, ఆకారాలు, జీవరాశులు, సంస్కృతులు, వైవిధ్యాలను తనలో ఇముడ్చుకొని ఉంటుంది. భూమి సహనం, సమతుల్యత, సృజనాత్మకత, ఔదార్యం, సమగ్రతకు ప్రతీక. ప్రతి జీవికి స్థలం కల్పిస్తూ, అందరినీ తన ఒడిలోకి తీసుకుంటుంది. అందుకే భూమి మనకు నాయకత్వంలో అత్యంత విలువైన పాఠాన్ని నేర్పుతుంది
“అందరినీ కలుపుకొని ముందుకు నడిపించగల
సామర్థ్యమే గొప్ప నాయకత్వం.”

భూమి నాయకత్వ శైలి అంటే ఏమిటి?

భూమి నాయకత్వ శైలికి చెందిన నాయకులు సమగ్రత (Iఅcశ్రీusఱఙవఅవss)కు ప్రతీకలు.
వీరు : విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువస్తారు. వైవిధ్యాన్ని బలంగా భావిస్తారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమష్టి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తారు. పురోగతిని సామరస్యంతో సమతుల్యం చేస్తారు. వారి నాయకత్వం కేవలం అభివృద్ధిని మాత్రమే కాదు, సమాజంలో ఐక్యతను కూడా పెంపొందిస్తుంది.

వైవిధ్యంలో ఏకత్వాన్ని చూసే నాయకులు భూమిపై అనేక రకాల మొక్కలు, జంతువులు, మనుషులు జీవిస్తున్నట్లే, సమాజంలో కూడా భిన్న అభిప్రాయాలు, సంస్కృతులు, భాషలు, ఆలోచనలు ఉంటాయి. భూమి నాయకత్వ శైలికి చెందిన నాయకులు ఈ భిన్నతలను సమస్యగా కాకుండా అవకాశంగా చూస్తారు. వారు వ్యక్తుల పేర్లు, రంగులు, మతాలు, ప్రాంతాలు, భాషలు వంటి బాహ్య భేదాల కంటే వారి అసలు విలువను గుర్తిస్తారు. అందుకే వీరు విభజన కంటే ఐక్యతను, పోటీ కంటే సహకారాన్ని, స్వార్థం కంటే సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తారు.

స్థానికంగా ఆలోచిస్తూ, ప్రపంచ దృష్టితో
పనిచేసే నాయకులు :
భూమి నాయకత్వం ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది.

వీరు తమ స్థానిక సమాజ అవసరాలను అర్థం చేసుకుంటూనే ప్రపంచ దృక్పథంతో ఆలోచిస్తారు. ఒకవైపు గ్రామం, పాఠశాల, సంస్థ లేదా సమాజ అభివృద్ధిపై దృష్టి పెడుతూనే, మరోవైపు మానవాళి శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుంటారు. అందువల్ల వీరి నాయకత్వం స్థానికతను గౌరవిస్తూ, విశ్వమానవతను ఆలింగనం చేస్తుంది.

Earth Leadership Qualities for Students 1

మార్పును స్వీకరించే నాయకత్వం :

భూమిపై చెట్లు పాత ఆకులను వదిలి కొత్త ఆకులను స్వీకరించినట్లే, ఈ నాయకులు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, తమ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటారు.

వారి లక్షణాలు :

నిరంతర అధ్యయనం
మార్పులకు అనుగుణంగా స్పందించడం
కొత్త ఆలోచనలను స్వీకరించడం
ప్రమాణాలను ఎప్పటికప్పుడు పెంచుకోవడం
భవిష్యత్తును ముందుగానే ఊహించి సిద్ధమవడం
వారు గత విజయాలపై విశ్రాంతి తీసుకోరు. నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తారు.

అత్యంత ఉదారమైనా… అత్యంత
వివేకవంతమైన నాయకులు

భూమి నాయకత్వ శైలికి చెందిన నాయకులు సాధారణంగా అత్యంత నిస్వార్థులు, సహనశీలులు, ఔదార్యవంతులు. అయితే వారిని అందరూ సులభంగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే చాలా మంది ఇంకా కులం, మతం, ప్రాంతం, భాష, రంగు వంటి పరిమిత ఆలోచనలతో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో సమగ్ర దృష్టితో ఆలోచించే నాయకులు కొందరికి విచిత్రంగా కనిపించవచ్చు.
అందువల్ల వీరు తరచుగా అపార్థాలకు గురవుతారు. అయినప్పటికీ తమ మార్గాన్ని విడిచిపెట్టరు.

విలువల విషయంలో రాజీ లేని నాయకులు

భూమి నాయకులు సహనాన్ని ప్రదర్శిస్తారు. అందరినీ గౌరవిస్తారు. కానీ వారి విలువలు, లక్ష్యాలు, నైతికత విషయంలో రాజీ పడరు.

అవసరమైతే:

కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.
తప్పులను సరిదిద్దుతారు.
సమాజానికి అవసరమైన సందేశాన్ని బలంగా చేరవేస్తారు.
వారి దృఢత్వం వ్యక్తులపై కాదు, విలువలపై ఉంటుంది.
“అసాధ్యం” అనే పదం లేని నాయకులు
భూమి నాయకత్వ శైలికి చెందిన వ్యక్తులు ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచిస్తారు.

వారు :

సృజనాత్మకతను ప్రోత్సహిస్తారు.
సమస్యల కంటే పరిష్కారాలపై దృష్టి పెడతారు.
సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటారు.
ఇతరులను ప్రేరేపిస్తారు.
అందుకే వారి నిఘంటువులో “అసాధ్యం” అనే పదానికి స్థానం ఉండదు.
విద్యార్థులకు భూమి నేర్పే నాయకత్వ పాఠాలు
అందరినీ గౌరవించండి.
వైవిధ్యాన్ని బలంగా చూడండి.
కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు.
వ్యక్తుల మధ్య ఉన్న భేదాల కంటే మానవత్వాన్ని గుర్తించండి.
సమాజ శ్రేయస్సును వ్యక్తిగత ప్రయోజనాల కంటే గొప్పగా భావించండి.
విలువల విషయంలో రాజీ పడవద్దు.

ముగింపు

భూమి మనకు ఒక గొప్ప నాయకత్వ సూత్రాన్ని నేర్పుతుంది:
“నిజమైన నాయకుడు అందరినీ ఒకేలా మార్చడానికి ప్రయత్నించడు; వారి భిన్నతలను గౌరవిస్తూ ఒకే లక్ష్యం కోసం కలుపుకొని ముందుకు నడిపిస్తాడు.”
భూమి అనేక రకాల జీవాలను, రంగులను, సంస్కృతులను తనలో కలుపుకుంటుంది.
ప్రపంచానికి ఈరోజు అత్యంత అవసరమైన నాయకులు భూమిలాంటి నాయకులే వైవిధ్యాన్ని ఆలింగనం చేసుకొని, సామరస్యాన్ని పెంపొందించి, సమగ్ర అభివృద్ధికి మార్గం చూపే నాయకులు.
“భూమిలా విశాలంగా ఆలోచించండి… అందరినీ కలుపుకొని అభివృద్ధి వైపు నడిపించే నాయకులుగా ఎదగండి!”

ఈ నాయకులు :

అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారు.
వైవిధ్యాన్ని గౌరవిస్తారు.
సృజనాత్మకతను ప్రోత్సహిస్తారు.
సమాజ ప్రయోజనాలను వ్యక్తిగత ప్రయోజనాల కంటే గొప్పగా భావిస్తారు.
వారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ ఆలోచనలను నవీకరించుకుంటారు. మార్పులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటారు. “అసాధ్యం” అనే పదం వారి నిఘంటువులో ఉండదు.
“స్వయాన్ని తెలుసుకో… నాయకత్వాన్ని వెలికితీయి; సమాజాన్ని ప్రగతి, సామరస్యం మరియు శ్రేయస్సు వైపు నడిపించు!”
ఓ విద్యార్థీ! నీవు సామర్థ్యంలో అనంతుడివి, అవకాశాల్లో అపరిమితుడివి!

Earth Leadership Qualities for Students0

రీడ్ ఇండియా సెలబ్రేషన్
(కోటికి పైగా విద్యార్థుల్లో పఠన చైతన్యాన్ని
వెలిగించిన హైదరాబాద్‌కు చెందిన సంస్థ..
For validation, Google: Worldus largest reading festival for students)
www.readindia.info

- Advertisement -
RELATED ARTICLES

Latest News