Homeసాహిత్యంAccusations | ఆరోపణలు..!

Accusations | ఆరోపణలు..!

వాదోపవాదాల హోరులో
నిందారోపణల తీరులో
పాలించాల్సిన పరిణామం
ప్రమాదం మించి పోయింది
ప్రగల్భాల జోరులో
ప్రకోపాల అలజడిలో
ఏలిక ఏకాకితనాన్ని
దుప్పటి చేసి కప్పుకుంది
నువ్వా నేననే పందెంతో
నీదా నాదనే ఆత్రంతో
అభివృద్ధికి తెగులొచ్చి
నశించడం మొదలైంది
గతాన్ని బాగా రంగరిస్తూ
ప్రస్తుతానికి తెర వేస్తూ
చేయాల్సిన పని పైన
అశ్రద్ధ పాగా వేసింది
గాంభీర్య వదనంతో
డాంభీకపు బింకంతో
ఏలిక నాలిక్కరుచుకుని
మౌనం మీదేసుకుంది
పంచుకోడాల ఎత్తులతో
తుంచుకోడాల కత్తులతో
పాలిత గడువు ముగిసి
కాలం చెల్లిపోతోంది
మాటల యుద్ధాలతో
చేష్టల పన్నాగాలతో
ఎక్కడ వేసిన పథకం
ఆడనే మగ్గిపోతోంది

- Advertisement -
RELATED ARTICLES

Latest News