HomeసినిమాOka Court Case | మూవీ ట్రైలర్ లాంచ్

Oka Court Case | మూవీ ట్రైలర్ లాంచ్

టాలీవుడ్‌లో ప్రేమ, విరహం, మోసం, ప్రతీకారం అనే కాన్సెప్ట్‌లతో ఇప్పటికే వందల సినిమాలు వచ్చాయి. కానీ, ప్రేమలో మోసపోయిన ఒక సాధారణ యువకుడు.. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం, తన లవర్ పైనే కేసు పెట్టడం అనే ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని కథాంశంతో వస్తున్న చిత్రమే ‘ఒక కోర్టు కేస్’. ఓపెన్ ఐస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నాగేష్ పూడి, ముకేష్ పూడి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది, జులై 17న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. 

Oka Court Case movie trailer launch1

చిత్ర దర్శక నిర్మాత గణేష్ పూడి మాట్లాడుతూ.. “మేము ఈ చిత్రానికి ‘ప్రతి ప్రేమికుడికి తన ప్రేమ కోసం పోరాడే హక్కు ఉంది’ అనే క్రేజీ క్యాప్షన్‌ను ఇచ్చాం. ప్రేమలో మోసపోయిన ఒక వ్యక్తి న్యాయం కోసం లీగల్‌గా ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ సినిమా కథ. ముఖ్యంగా బ్రేకప్ తర్వాత జరిగే ప్రతీకారం అనే సరికొత్త కోణాన్ని ఇందులో ఫుల్ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వినోదాత్మకంగా చూపించబోతున్నాం. టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది” అని చెప్పారు. 

- Advertisement -
Oka Court Case movie trailer launch2

హీరో సూర్యాన్ష్ మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో ‘ఒక కోర్టు కేస్’ చాలా స్పెషల్ ఫిలిం. కథ వినగానే చాలా కొత్తగా అనిపించింది. తనకు జరిగిన మోసానికి వ్యతిరేకంగా ఒక యువకుడు కోర్టులో చేసే పోరాటం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.

Oka Court Case movie trailer launch3
- Advertisement -
RELATED ARTICLES

Latest News