పారపట్టే చేతికి యాప్‌ల పరీక్షలా? నాగలి దున్నే రైతుకు మీ సేవల చుట్టూ ప్రదక్షిణలా? నోరు లేని భూతల్లిని నమ్ముకుని, చదువురాని నిరక్షరాస్యులైన రైతన్నలు చెమటోడ్చి దేశానికి అన్నం పెడుతుంటే.. ప్రతి గింజకూ ఒక నిబంధన, ప్రతి బస్తాకూ ఒక రిజిస్ట్రేషన్ పేరిట వారి మెడకు సాంకేతికత అనే ఉరితాడు బిగిస్తారా? నిన్న యాప్ అన్నారు.. నేడు మీ సేవ అంటున్నారు.. రేపు నిలువునా ముంచే దళారుల చేతికి రైతన్నల బతుకులను తాకట్టు పెడతారా? రైతుకు కావాల్సింది కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టం కాదు.. పొలానికి కావలసిన ‘యూరియా’ మాత్రమే! ఈ యాప్‌ల గారడీలు, మీ సేవల దోపిడీలు ఆపి.. నేరుగా అన్నదాతకే ఎరువులు అందించండి, లేదంటే రైతన్నల ఆగ్రహానికి బదులు చెప్పక తప్పదు!
- Advertisement -
