Saturday, July 4, 2026
Homeకెరీర్ న్యూస్Recruitment | నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

Recruitment | నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

  • 7 వేల కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర..
  • ఈ నిర్ణయం నిరుద్యోగులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు..

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. హోంశాఖ పరిధిలోని పోలీస్, జైళ్లు, అగ్నిమాపకశాఖ, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాల్లో దాదాపు 7 వేల కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. హోంశాఖలో ఉద్యోగాల భర్తీ కోరుతూ గత కొద్దిరోజులుగా అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం రెండు విడతల్లో చర్యలు చేపడుతుంది.

ఇందులో భాగంగా ఇప్పటికే 5 వేల పోలీస్‌ పోస్టుల భర్తీకి అధికారిక ఉత్తర్వులు జారీ కాగా ఎస్పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన మిగిలిన 2 వేల పోస్టుల కోసం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ప్రక్రియ అంతా కొలిక్కి వచ్చిన వెంటనే, తెలంగాణ పోలీస్‌ నియామక మండలి మరొకట్రెండు రోజుల్లోనే అధికారికంగా ఉద్యోగ నోటిఫికేషన్‌ను వెలువరించడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం జీవో ప్రకారం.. 5 వేల పోలీస్ ఉద్యోగాల్లో అత్యధికంగా 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.

- Advertisement -

వీటితో పాటు 148 సివిల్ ఎస్సై, 24 ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్, 23 ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై, 20 కానిస్టేబుల్ పీటీఓ, 14 ఏఆర్ ఎస్సై, 12 టీజీఎస్పీ ఏఆర్ఎస్సై, 7 కానిస్టేబుల్ పీటీఓ, 3 ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్సై పోస్టులు ఈ జాబితాలో చేరి ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హోంశాఖలో వెలువడుతున్న నాలుగో అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. గతంలో తొలిసారిగా 2015న 9,281 పోస్టులతో, ఆ తర్వాత 2018లో 1,217 ఎస్సై, 16,285 కానిస్టేబుల్ పోస్టులతో రెండో నోటిఫికేషన్ వచ్చింది. అనంతరం మూడోసారి 2022లో 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయగా, ప్రస్తుతం రాబోయే 7 వేల పోస్టుల నోటిఫికేషన్ అభ్యర్థులకు మరో సువర్ణావకాశంగా మారనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News