Friday, June 26, 2026
Homeఖమ్మంAwareness | యువత డ్ర*గ్స్ జోలికి పోవద్దు

Awareness | యువత డ్ర*గ్స్ జోలికి పోవద్దు

  • సీఐ ముత్యం రమేష్

యువత డ్ర*గ్స్ జోలికి పోవద్దని వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ డ్ర*గ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో డ్ర*గ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ యువత డ్ర*గ్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. డ్ర*గ్స్ కి బానిస అవడం వల్ల కలిగే అనర్థాలు గురించి వివరించారు. డ్ర*గ్స్ అమ్మినా, కొన్నా, సేవించినా, రవాణా చేసినా నేరంగానే పరిగణించ బడుతుందని వివరించారు. డ్ర*గ్స్ అందులో ముఖ్యం గా గంజాయి సంబంధించిన సమాచారం ఇస్తే రూపాయలు 5000/-లు నగదు బహుమతి ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు తిరుపతి రావు, తిరుపతి రెడ్డి, అలుబాక సర్పంచ్ ఆదిలక్ష్మి, బోదాపురం సర్పంచ్ కోర్స నరసింహ రావు, యువత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News