Friday, June 26, 2026
HomeఫోటోలుIt's Life Bro | మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన నితిన్‌

It’s Life Bro | మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన నితిన్‌

కేఎం (కృష్ణమోహన్‌), పూజా సుందర్‌ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్స్ లైఫ్‌ బ్రో’. కేఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సోమశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ మోహన్‌ సల్లగుండ్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తన్నారు. ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రామిసింగ్‌  హీరో నితిన్‌ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ” వైవిధ్యమైన కథ, కథనాలతో ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ భావోద్వేగ ప్రేమకథ అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

కృష్ణమోహన్‌, పూజా సుందర్‌ శెట్టి, రాజీవ్‌ కనకాల, చమ్మక్‌ చంద్ర, అంబటి శ్రీనివాస్‌, దేవి ప్రసాద్‌, కిరీటి, త్రిశూల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ఫ్లే: ఇ.రాజయ్య. డీఓపీ:  చైతన్య, సంగీతం: సాహిత్య సాగర్‌, ఎడిటర్‌: సత్య గిద్దుటూరి

- Advertisement -
RELATED ARTICLES

Latest News