- బడిబాట పట్టిన చిన్నారులు..
- ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం
- చిన్నారులకు పలకలు పంపిణీ చేసిన ‘ఇందిరా ఫౌండేషన్’
మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. బడిలో కొత్తగా చేరిన ప్రీ-ప్రైమరీ చిన్నారులకు ‘ఇందిరా ఫౌండేషన్ సర్వీస్’ చైర్మన్ వడ్డగాని సాయిరాం ఆధ్వర్యంలో పలకలు, బలపాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచితంగా మెరుగైన ఆంగ్ల మాధ్యమ విద్య అందుబాటులో ఉందని తెలిపారు. సర్కారు బడుల్లో ప్రీ-ప్రైమరీ నుంచే నాణ్యమైన బోధన అందిస్తున్నామని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండ శ్రీనివాస్, బి. మీనాకుమారి, బేగంతో పాటు పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
