Wednesday, June 24, 2026
Homeభక్తిMaharshi | వేద భారతావనిలో ప్రముఖుడు యాజ్ఞవల్కుడు

Maharshi | వేద భారతావనిలో ప్రముఖుడు యాజ్ఞవల్కుడు

శ్లో॥ వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహమ్, యాజ్ఞవల్క్యం ముని శ్రేష్ఠం జిష్ణుం హరి హర ప్రభుమ్,
శ్లో॥ జితేంద్రియం జితక్రోధం సదా ధ్యాన పరాయణమ్, ఆనందనిలయం వందే యోగానంద మనీశ్వరమ్;
శ్లో॥ఏవం ద్వాదశ నామాని త్రికాలే యః పఠే న్నరః; యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేత్…

యాజ్ఞవల్క్య మహర్షి ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞ వల్క్యుడు శతపథ బ్రాహ్మణం (బృహదారణ్య కోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు. పూర్వం కురుపాంచాల దేశంలో గంగానదీ తీరాన చమత్కార పురం అనే నగరంలో ఉండే యజ్ఞవల్క్యుడు అనే మహర్షి, ఆయన భార్య సునందలకు జన్మించినవాడే యాజ్ఞ వల్క్యుడు. యాజ్ఞవల్క్యుడు భాష్కలుడి దగ్గర రుగ్వేదాన్ని, జైమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అధర్వణ వేదాన్ని నేర్చుకున్నాడు. వైశంపాయన మహర్షి దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి అహంకారం, విద్యామదం లాంటివి కలిగాయి. ఆ విషయాన్ని గురువు గ్రహించాడు.

- Advertisement -

యాజ్ఞవల్క్యుడిలో నానాటికీ విద్యామదం అధికం అయింది. అది ఆత్మాభిమానమని యాజ్ఞవల్క్యుడు అనుకున్నాడు. ఓ రోజున వైశంపాయనుడు తన మేనల్లుడు అధర్మమార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని కోపం పట్టలేక కాలితో అతడిని తన్నాడు. బ్రాహ్మణుడిని కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపాయనుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదన పడసాగాడు. ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు గురువు దగ్గరగా వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తనవల్ల తప్ప మరెవరివల్లా కాదని గర్వంగా అన్నాడు.

తనపాపం పోవటం అటుంచి అంతటి కష్టకాలంలోను శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువుకు కోపం తెప్పించింది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని, అప్పటిదాకా నేర్పిన వాటి నన్నింటినీ కక్కి (ఏవీ గుర్తుంచు కోకుండా మరిచిపోయి) వెళ్ళిపొమ్మని అన్నాడు. గురు ద్రోహానికి అదే తగిన శిక్ష అని అన్నాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభావాన్ని కలిగివున్నానని తెలుసు కొన్నాడు.

క్షమించమని గురువును వేడుకొన్నా లాభం లేకపోయింది. అయితే తనవంతు బాధ్యతగా యాజ్ఞవల్క్యుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకొన్న వేదాలను అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళి పోయాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్క్యుడు విసర్జించినదాన్ని కొన్ని తిత్తిరి పక్షులు గ్రహించి, అవి తిరిగి ఆ వేదసారాన్ని పలికిన పలుకులే తైత్తిరీయోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి.

గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞ వల్క్యుడు ఆత్మస్త్థెర్యంతో సూర్య భగవానుడిని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్ల యజు ర్వేదాన్ని నేర్చుకున్నాడు. తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలూ అభ్యసించాడు. ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్క్యుడు పేరుతెచ్చు కున్నాడు. కణ్వుడు లాంటి ఉత్తమ శిష్యులు ఆయనదగ్గర శిక్షణ పొందాడు. ఒకసారి జనకుడు యాగం చేస్తూ మహర్షులందరినీ ఆహ్వానించాడు.

యాజ్ఞవల్క్యుడికి ఆహ్వానం వెళ్ళింది. అలా మహర్షు లందరూ రాగానే జనకుడు మీలో ఎవరు గొప్ప విద్యా వంతులైతే వారొచ్చి ఇక్కడున్న ధనరాశులను తీసుకు వెళ్ళవచ్చు అని అన్నాడు. రుషు లంతా ఒకరిముఖాలు ఒకరు చూసుకొని తామందుకు అర్హులం కామను కొంటూ ఊరకనే కూర్చున్నారు. యాజ్ఞవల్క్యుడు మాత్రం లేచి తన శిష్యులను పిలిచి ఆ ధనరాశులను తన ఇంటికి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు.

యాజ్ఞవల్క్యుడి ధైర్యాన్ని చూసిన తర్వాత అతడితో శాస్త్ర విషయాల్లో పోటీకి దిగి యాజ్ఞ వల్క్యుడిని అనర్హుడిగా నిరూ పించేందుకు చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో జనకుడు ఆ రుషిని గొప్పగా పూజించి సత్కరించాడు. జనకునికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. ఓ రోజున విశ్వావసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్క్యుడి వద్దకు వచ్చి, తత్త్వాన్ని ఉపదేశించమని కోరి ఎంతో నేర్చుకొని యాజ్ఞవల్క్యు డంతటి గొప్పవాడు మరొకడు లేడని ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళి పోయాడు. అనంతరకాలంలో ఆ రుషి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు.

ఆ రోజుల్లో కతుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే పేరున్న కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యుడి కిచ్చి పెళ్ళిచేశారు పెద్దలు. అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె, పండితురాలైన గార్గి అనే ఆమె శిష్యురాలు అయిన మైత్రేయి యాజ్ఞవల్క్యుడిని వివాహ మాడాలని పట్టుబట్టింది. అప్పటికే అతడికి కాత్యాయనితో వివాహం కావటంతో పెద్దలకు ఏంచేయాలో అర్థంకాలేదు. గార్గి ఈ సమస్యకు సమాధానాన్ని వెతికింది. మైత్రేయిని కాత్యాయనికి పరిచయంచేసి ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేలా చేసింది.

కాత్యాయని, మైత్రేయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పింది. కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞ వల్క్యుడితో వివాహాన్ని జరిపించింది. అలా యాజ్ఞ వల్క్యుడికి ఇద్దరు భార్యల య్యారు. రుషులంతా యాజ్ఞ వల్క్యుడి లోని విద్యా వైభవాన్ని, యోగ ప్రాభవాన్ని గుర్తించి మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. అతను బుషులకు తెలియజేసిన విషయాలే యోగశ్రాస్తమని యోగ యాజ్ఞవల్క్య మనీ ప్రసిద్ధికెక్కాయి. యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వమునుపదేశించి సన్యసిం చాడు. ఆయన పేర ఒక స్మృతి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News