బతుకుదెరువు కోసం గల్ఫ్ కు వెళ్లిన సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామ వాసి రోడ్డు ప్రమాదంలో ఈ రోజు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల వైకుంఠాపూర్లో విషాద చాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన లగ్గం జగదీష్ పొట్టకూటి కోసం గల్ఫ్కు వెళ్లాడు. అకస్మాత్తుగా అనుకొని రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందగా కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడికి భార్య కుమారుడు, కూతురులున్నారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులు జగదీష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
- Advertisement -
