- పాల్గొన్న కండ్లకొయ్యా మాజీ కౌన్సిలర్ హంస కృష్ణా గౌడ్..
- పలు యోగాసనాలను అభ్యసించిన వైనం..
యోగాతో మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చు అని గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్ సముద్రాల హంసా కృష్ణాగౌడ్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు యోగా ఆసనాలను అభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అనేది భారతీయ సనాతన సంస్కృతికి ప్రతీక అని, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసి భారత ఔన్నత్యాన్ని చాటారని అన్నారు.
యోగ సాధన శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా దివ్య ఔషధంలా పనిచేసి ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని అందిస్తుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకుని ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని హంస కృష్ణా గౌడ్ పిలుపునిచ్చారు.
