Sunday, June 21, 2026
Homeరంగారెడ్డిSarpanch | కూచారం గ్రామ అభివృద్ధికి ఎంపీ నిధులు కోరిన

Sarpanch | కూచారం గ్రామ అభివృద్ధికి ఎంపీ నిధులు కోరిన

  • సర్పంచ్ చిత్ర రఘు
  • నమ్మిన ప్రజల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

కూచారం గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన నిధులను మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ రాజనాల చిత్ర రఘు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం తదితర అభివృద్ధి పనుల కోసం ఎంపీ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు గ్రామ అభివృద్ధి అవసరాలను పరిశీలించి, సాధ్యమైన మేరకు ఎంపీ నిధుల ద్వారా సహకారం అందిస్తామని సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు కిరణ్ కుమార్ యాదవ్, మండల సీనియర్ నాయకుడు శ్రీకాంత్ యాదవ్, మాజీ వార్డు సభ్యుడు శ్రీహరి గౌడ్, వంగల రాము గౌడ్, తదితరులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ఎంపీ నిధుల మంజూరు కోసం చేసిన ఈ విజ్ఞప్తి ఫలిస్తే కూచారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఊతం లభిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News