Sunday, June 21, 2026
Homeఆదిలాబాద్Yoga | ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు:

Yoga | ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు:

నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ యోగ వేడుకలలో భాగంగా యోగా శిక్షకులు, ప్రతి యోగాసనం యొక్క ఉపయోగం తెలుపుతూ కార్యక్రమానికి హాజరైన వారితో వివిధ రకాల యోగాసనాలు వేయించారు.

నేడు ప్రపంచం మొత్తం యోగాను ఆచరిస్తుందని, ప్రజలంతా నిత్యజీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగ సాధనతో ఎన్నో రకాల మొండి వ్యాధులు కూడా నయమవుతాయని అన్నారు. యోగాతో, శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించారు. ప్రతిరోజు కొద్ది సమయం యోగాకి కేటాయించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని తెలిపారు.

- Advertisement -

ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో డిఇఓ భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, నోడల్ అధికారి సత్యనారాయణరావు, ఇతర అధికారులు, సిబ్బంది, శిక్షకులు, పట్టణవాసులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News