దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కడెం మండల కేంద్రంలో శనివారం ఒక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, భారతదేశ రాజకీయ ప్రస్థానంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించి, 12 ఏళ్ల సుదీర్ఘ పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ప్రశంసించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో గణనీయమైన పురోగతి సాధించిందని అన్నారు.



- Advertisement -
