Tuesday, June 9, 2026
HomeజాతీయంAI Jobs | ఐటీ రంగానికి ఎలాంటి ముప్పు లేదు..

AI Jobs | ఐటీ రంగానికి ఎలాంటి ముప్పు లేదు..

  • భరోసా ఇచ్చిన టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్..
  • భారీ సంఖ్యలో ఏ ఐ ఏజంట్లను తయారు చేసున్నామని వెల్లడి..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి ఎటువంటి ముప్పు లేదని, వాస్తవానికి ఇది అపారమైన వృద్ధికి ఒక గొప్ప అవకాశమని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ భరోసా ఇచ్చారు. ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనిచేసేలా తమ సంస్థ భారీ సంఖ్యలో ‘ఏఐ ఏజెంట్లను’ అభివృద్ధి చేస్తోందని ఆయన వెల్లడించారు.

మంగళవారం జరిగిన టీసీఎస్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చంద్రశేఖరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ రాకతో సంప్రదాయ ఐటీ సేవల నమూనాలకు ఆటంకం కలుగుతుందన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. “ఏఐ అనేది ఐటీ పరిశ్రమకు ముప్పు కాదు. టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్యకు సమానంగా ఏఐ ఏజెంట్లు ఉండే రోజు ఎంతో దూరంలో లేదు” అని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలోనే ఇది సాధ్యపడొచ్చని ఆయన అంచనా వేశారు.

- Advertisement -

ప్రస్తుతం టీసీఎస్‌లో సుమారు 5.84 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో 2.17 లక్షల మందికి పైగా అధునాతన ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ పొందారు. ఏఐ ద్వారా కంపెనీ వార్షిక ఆదాయం ఇప్పటికే 2.5 బిలియన్ డాలర్లకు చేరువలో ఉందని, వందలాది జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News