- విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి లోకేష్..
- కిమ్స్ ఆసుపత్రి వైద్యులకు సూచనలు..
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ విశాఖపట్నంలో పర్యటించారు. స్టీల్ ప్లాంట్ అగ్నిప్రమాదంలో గాయపడి స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించారు. ప్రమాద బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ఆర్. మల్లికార్జునరావు, గుడివాడ అర్జున అప్పారావు, బి. సత్యానందను మంత్రి లోకేశ్ పరామర్శించి, వారికి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని, అధైర్యపడవద్దని మంత్రి లోకేశ్ బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో మంత్రి లోకేశ్ వెంట కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
