Tuesday, June 9, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంSainikpuri Bhavans | సైనిక్ పురి భవన్స్‌లో ‘పిల్లి రాము’ అరాచకాలు..

Sainikpuri Bhavans | సైనిక్ పురి భవన్స్‌లో ‘పిల్లి రాము’ అరాచకాలు..

  • నిబంధనలు తుంగలో తొక్కి ప్రిన్సిపాల్‌గా నియామకం?
  • మూడు జీతాలు, 2 సైడ్ ఇన్కమ్‌లు మెక్కుతున్న పిల్లి రాము..
  • ఎలాంటి పేపర్ ప్రకటన లేకుండానే ప్రినిసిపాల్‌గా నియామకం..
  • ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు క్వాలిఫికేషన్ లేదు..
  • ప్రిన్సిపాల్‌గా కనీసం 4 సబ్జెక్టులు బోధించాల్సిన నియమం ఉంది..
  • బోధించే సామర్ధ్యం కూడా పిల్లిరాముకు లేదని విమర్శలు..
  • కొత్తగా వచ్చిన చైర్మన్, వైస్ చైర్మన్లకు తెలిసే జరిగిందా..?
  • వారి దృష్టికి రాకుండా మేనేజ్ చేశారా అన్నది ప్రశ్నార్థకం..
  • జరిగిన వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలి
  • బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • డిమాండ్ చేస్తున్న సైనిక్ పురి భవన్స్ ఉద్యోగులు, తొలగించబడిన ఉద్యోగులు

ప్రముఖ విద్యాసంస్థ సైనిక్‌పురి భారతీయ విద్యాభవన్ అవినీతి, అక్రమ నియామకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందా? నిబంధనలను తుంగలో తొక్కి, కనీస అర్హతలు లేని వ్యక్తిని పీఠంపై కూర్చో బెట్టారా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి విశ్వసనీయ వర్గాలు. వైస్ ప్రిన్సిపాల్, పీటీగా పనిచేస్తున్న పిల్లి రాము అనే వ్యక్తి సాగిస్తున్న అరాచకాలు, విద్యాసంస్థ రూల్స్‌కు విరుద్ధంగా జరిగిన ఆయన ప్రిన్సిపాల్ (అఫిలియేటింగ్) నియామకం ఇప్పుడు భవన్స్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

రూల్స్ బ్రేక్..:

భవన్స్ బైలాస్ ప్రకారం.. ఏదైనా క్యాంపస్‌కు ప్రిన్సిపాల్‌గా ఉన్న వ్యక్తి రిటైర్ కావడానికి మూడు నెలల ముందే పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఎంపికైన కొత్త అభ్యర్థి, పాత ప్రిన్సిపాల్ రిటైర్ అవ్వడానికి నెల రోజుల ముందే బాధ్యతలు స్వీకరించాలి. 1995 నాటి 17వ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

అయితే, మే 31, 2026న ఇక్కడి ప్రిన్సిపాల్ సుజా దట్ట పదవీ విరమణ చేశారు. నిబంధనల ప్రకారం మూడు నెలల ముందే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా.. అలాంటిదేమీ జరగలేదు. కనీసం కొత్త అభ్యర్థి నెల ముందు చార్జ్ తీసుకోలేదు. ఈ రూల్స్ అన్నింటినీ కాలరాస్తూ, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లి రాముకు అక్రమ మార్గంలో ప్రిన్సిపాల్‌గా ఎలా బాధ్యతలు అప్పగిస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.

క్వాలిఫికేషన్ లేదు.. సబ్జెక్ట్ చెప్పడం రాదు!:

ప్రిన్సిపాల్ హోదాలో బాధ్యతలు నిర్వహించడానికి పిల్లి రాముకు కనీస అర్హత లేదని భవన్స్ ఉద్యోగులు బహిరంగంగానే విమర్శిస్తు న్నారు. భవన్స్ నిబంధనల ప్రకారం క్యాంపస్‌లోని ముగ్గురు ప్రిన్సిపాల్స్ ఖచ్చితంగా విద్యార్థులకు 4సబ్జెక్టులు బోధించాల్సి ఉం టుంది. కానీ, పిల్లి రాముకు కనీసం సబ్జెక్టులు చెప్పే సామర్థ్యం గానీ, అర్హత గానీ లేవని తెలుస్తోంది. మరి ఇలాంటి వ్యక్తిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకే వ్యక్తి.. 3 జీతాలు.. 2 సైడ్ ఇన్‌కమ్‌లు! :

పిల్లి రాము విద్యాసంస్థల నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఆర్థిక లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఒకే సమయంలో ప్రిన్సిపాల్‌గా, వైస్ ప్రిన్సిపాల్‌గా, పీటీగా మూడు రకాల జీతాలు/భత్యాలు పొందుతున్నట్లు సమాచారం. దీనికి తోడు క్యాంపస్‌లో క్రికెట్ కో-ఆర్డినేటర్‌గా, టెన్నిస్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ రెండు రకాల అదనపు ఆదాయాన్ని కూడా వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తి ఇన్ని పోస్టుల్లో ఉంటూ ఇంతలా దోచుకుంటుంటే యాజమాన్యం ఎందుకు మౌనంగా ఉందో అర్ధం కావడం లేదు.

విధులు శూన్యం.. అంతా తెరవెనుక రాజకీయం! :

ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ, పిల్లి రాము విద్యార్థులకు గానీ, విద్యాసంస్థకు గానీ ఎలాంటి సేవలూ అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం కేంద్ర ఆఫీసులో కూర్చుని తన అవినీతి కార్యకలాపాలు సాగించడం, లేదా వయోవృద్ధుడైన సైనిక్‌పురి భవన్స్ డైరెక్టర్ రమణ ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తూ తన స్థానాన్ని కాపాడుకోవడం మాత్రమే చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొత్త చైర్మన్, వీసీల పాత్ర ఏంటి? :

సైనిక్‌పురి భవన్స్‌కు చైర్మన్‌గా చలమేశ్వర్, వైస్ చైర్మన్‌గా దామో దర్ రావు బాధ్యతలు స్వీకరించి కేవలం 4 నెలలు మాత్రమే అవుతోంది. సంస్థలో ఇంత పెద్ద కుంభకోణం, నిబంధనల ఉల్లం ఘన జరుగుతుంటే వీరికి తెలిసి జరిగిందా? లేక వీరిని పక్కదారి పట్టించి ఈ నియామకం చేపట్టారా? ఒకవేళ తెలిస్తే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

ముంబై హెడ్ ఆఫీస్ స్పందించాలి!:

అనేకానేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, అర్హత లేకుండానే ప్రిన్సిపాల్ పీఠాన్ని దక్కించుకున్న పిల్లి రాము వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలని భవన్స్ ప్రస్తుత ఉద్యోగులు, అక్రమంగా తీసివేయబడ్డ మాజీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ముంబైలోని భవన్స్ ప్రధాన కార్యాలయం ఈ వ్యవహారంలో కల్పించుకుని, సమగ్ర విచారణ జరిపించి, పిల్లి రాముతో పాటు ఆయనకు వెనకుండి సహకరిస్తున్న సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యాసంస్థ ప్రతిష్టను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News