- కర్ణాటక బీదర్ జిల్లాలో ఘటన..
- అటెండర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద విధులు నిర్వహిస్తున్న అటెండెంట్ మహిళా మృ*తదేహాల ఫొటోలను రహస్యంగా తీస్తున్నాడు. ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో ఆసుప్రతి వైద్యాధికారి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీదర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ‘బ్రిమ్స్’ మార్చురీలో అటెండెంట్‌గా మునీర్ అహ్మద్ చాలా కాలంగా పని చేస్తున్నాడు. మార్చురీలో భద్రపరిచే మహిళా మృ*తదేహాల ఫొటోలను అతడు రహస్యంగా చిత్రీకరిస్తున్నాడు.
కాగా, పోస్ట్‌మార్టం సమయంలో ఎలాంటి చట్టపరమైన అనుమతి, అవసరం లేకుండా మహిళల మృ*తదేహాలపై ఉన్న దుస్తులు తొలగించి నగ్న ఫొటోలను మునీర్ అహ్మద్ తీశాడు. దీనిని గమనించిన ఒక డాక్టర్ అతడి మొబైల్ ఫోన్ పరిశీలించగా ఇలాంటి పలు ఫొటోలు కనిపించాయి. ఇది తెలుసుకుని డాక్టర్లు, వైద్య సిబ్బంది షాక్ అయ్యారు.
మరోవైపు బ్రిమ్స్ ప్రొఫెసర్, విభాగాధిపతి అయిన డాక్టర్ మోసినల్ హక్, మే 25న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మునీర్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
