- రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి, వందల కోట్ల భూభాగోతంపై ‘ఆదాబ్ హైదరాబాద’ సంచలన విస్ఫోటనం!
రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే.. ఇక సామాన్యుడికి దిక్కెవరు? శేర్లింగంపల్లి మండలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతను గాలికొదిలేసి, కబ్జాదారులతో చేతులు కలిపిన కొందరు అధికారులు తమ హోదాను అక్రమ సంపాదనకు సాధనంగా మార్చుకున్నారు.ఈ అవినీతి పర్వంలో ప్రధాన పాత్రధారి అయిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి.. గత ఎనిమిది ఏళ్లుగా ఒకే చోట తిష్టవేసి అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచారు. వందల కోట్ల ప్రభుత్వ భూములు కబ్జా కావడానికి తప్పుడు నివేదికలతో సహకరిస్తూ, కోట్ల రూపాయల ముడుపులు గడించినట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి.
మధ్యలో బదిలీల నాటకం నడిచినా.. మళ్లీ శేర్లింగంపల్లిలోనే కీలక స్థానాన్ని దక్కించుకున్నారంటే ఇతని అవినీతి నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.మరి ఈ అక్రమ సామ్రాజ్యం వెనుక ఉన్న పెద్దలెవరు? ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారుల మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? చంద్రారెడ్డి సాగించిన అరాచకాలపై పూర్తి ఆధారాలతో.. మీముందుకు తీసుకునిరానుంది “ఆదాబ్ హైదరాబాద“.. “మా అక్షరం అవినీతిపై అస్త్రం“ ఈ నినాదంతో శేర్లింగంపల్లి వందల కోట్ల అవినీతి నెట్వర్క్ను త్వరలోనే బట్టబయలు చేయబోతోంది.. మీ ‘ఆదాబ్ హైదరాబాద’..
