నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడానికి వచ్చే జూన్ నెల ఆఖరి వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల ఆదివారం తెలిపారు. డివిజనల్ పోలీసు అధికారి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని, శాంతికి భంగం కల్గించడం, పబ్లిక్ స్థలాల్లో డీజేలు, మ్యూజిక్లు, ప్రసంగాలు నిషేధమని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టవద్దని ఆమె హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.
- Advertisement -
