Saturday, May 30, 2026
HomeజాతీయంCriticism | విద్యా వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది..

Criticism | విద్యా వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది..

  • ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..
  • క్యూట్ ఎంట్రెన్స్ టెస్ట్ లో ఆలస్యం జరిగిందని విమర్శ..

ఒక్క పరీక్ష కూడా నిజాయితీగా నిర్వహించలేదని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సమస్త విద్యా వ్యవస్థను’ పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. శనివారం దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణలో ఆలస్యం జరిగింది. రాహుల్‌ గాంధీ దీనిపై స్పందించారు.

‘నీట్, సీబీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ, ఇప్పుడు క్యూట్‌. నాలుగు పరీక్షలు. కోటి మంది విద్యార్థులు. ఒక్క పరీక్ష కూడా నిజాయితీగా నిర్వహించలేదు’ అని విమర్శించారు. ‘విశ్వగురు’ అనే వాదనలను సవాల్‌ చేశారు. ప్రధాని మోదీ సమస్త విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. ‘మీరు ఏ తరం భవిష్యత్తును నాశనం చేస్తున్నారో, అదే తరం మిమ్మల్ని జవాబుదారీగా నిలబెడుతుంది’ అని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

కాగా, సీయూఈటీ ఆలస్యం జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో మరో వైఫల్యమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం అతిషి విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా దీనిపై స్పందించారు. అతిషి పోస్ట్‌ను ఆయన షేర్‌ చేశారు.

‘దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలి’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రకారం ప్రధాని మోదీకి మాస్టర్స్ డిగ్రీ ఉన్నదని ఎద్దేవా చేశారు. అలాగే జాతీయ స్థాయి పరీక్షల్లో పదే పదే జరుగుతున్న సంస్థాగత వైఫల్యాలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని ప్రతిపక్షాలు కోరాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News